ఎండిపోయి దర్శనమిస్తున్న హంద్రీనీవా కాలువ

Update: 2019-05-05 10:36 GMT

రాయలసీమలో పరుగులు పెట్టిన కృష్ణమ్మ ఇప్పుడు కనిపించడం లేదు. గలగలా పారిన కాలువ ఇప్పుడు ఎండిపోయింది. దీంతో జలహారతులు ఇచ్చిన జనం ఊసురోమంటున్నారు. అనంతపురం జిల్లా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న హంద్రీనీవా కాలువ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది..?

దశాబ్దాల కల నెరవేరిందని ఆనంద పడ్డారు. జలజలా పారుతున్న కృష్ణమ్మకు జలహారతులు పట్టారు. అయితే ఆ ఆనందం నెల రోజులు కూడా లేదు. కృష్ణా నది నీటితో కళకళ లాడిన హంద్రీనీవా కాలువ ప్రస్తుతం ఎండిపోయి దర్శనమిస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని 8 మండలాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో కాలువ నిర్మాణం జరిగింది. ఎన్నికల ముందు నీటిని కూడా విడుదల చేశారు. అయితే చివరి ఆయకట్టుకు నీరందకుండానే ప్రవాహం నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా మాల్యాలలో నీటి ఎత్తిపోతలు ఆగిపోయవడంతో ప్రవాహం నిలిచిపోయింది. జిల్లాలో ప్రవహించిన నీరు కాలువలకే పరిమితమైపోయింది. అయితే అధికారులు మాత్రం ఇది ట్రైల్ రన్ మాత్రమేనంటున్నారు. వర్షాలు పడితే ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Full View 

Similar News