యూపీలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎస్పీ, బీఎస్పీ

మహాకూటమితో బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఉత్తరప్రదేశ్‌లో ఊహించని షాకిచ్చాయి.

Update: 2019-01-12 08:10 GMT
SP-BSP alliance

మహాకూటమితో బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఉత్తరప్రదేశ్‌లో ఊహించని షాకిచ్చాయి ఎస్పీ, బీఎస్పీ. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడాలని నిర్ణయించిన ఇరు పార్టీలు కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే పొత్తులు ఖారారు చేసుకున్నాయి. మొత్తం 80 స్ధానాలకు గాను ఇరు పార్టీలు 37 స్ధానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. మిగిలిన ఆరు స్ధానాల్లో ఆర్‌ఎల్‌డీకి నాలుగు కేటాయించాయి. సోనియా, రాహుల్ పోటీ చేస్తున్న స్ధానాలు మినహా మరే సీట్లు కేటాయించకుండా ఏకపక్షంగా పొత్తులు ఖరారు చేశాయి. 

Similar News