సహకార ఎన్నికలకు సర్కారు బ్రేక్‌

తెలంగాణలో సహకార ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. పంచాయతీ పోల్స్‌తో పాటే కొంచెం అటుఇటుగా సహకార ఎన్నికలు కూడా జరుగుతాయనుకున్నా ఇప్పట్లో నిర్వహించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Update: 2019-01-09 03:44 GMT
society elections

తెలంగాణలో సహకార ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. పంచాయతీ పోల్స్‌తో పాటే కొంచెం అటుఇటుగా సహకార ఎన్నికలు కూడా జరుగుతాయనుకున్నా ఇప్పట్లో నిర్వహించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే సహకార ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణలో సహకార ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో జరుగుతాయనుకున్న సహకార ఎన్నికలు ఇప్పట్లో ఉండవని వ్యవసాయశాఖ సర్క్యులర్ జారీ చేసింది. పంచాయతీ పోల్స్‌తో పాటే కొంచెం అటుఇటుగా సహకార ఎన్నికలు కూడా ఉంటాయని అంతా భావించారు. రాష్ట్రంలో మొత్తం 906 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కూడా అనుకుంది. అలాగే తొమ్మిది డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, రాష్ట్ర సహకార బ్యాంకులకు కూడా ఎన్నికలు జరపాలని భావించింది. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల తర్వాతే సహకార ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం డిసైడైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సహకార ఎన్నికలకు అప్పుడే తొందరేముందని అన్నట్లు తెలిసింది.

పంచాయతీ ఎన్నికల తర్వాతే సహకార ఎన్నికలను నిర్వహించాలనే సర్క్యులర్‌‌ను రిలీజ్‌‌ చేసినప్పటికి ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదంటున్నారు అధికారులు. అయితే ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించమంటే అప్పుడు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అధికారులు చెబుతున్నారు.

Similar News