వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణం...పోలీసుల అదుపులో...

Update: 2019-03-19 04:42 GMT

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా గంగిరెడ్డిని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వరరెడ్డిని కూడా సిట్ అధికారులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నుంచి కడప తరలించి విచారిస్తున్నారు. 

Similar News