టీకాంగ్రెస్‌లో కలకలం రేపుతోన్న సర్వే ఎపిసోడ్‌...ఉత్తమ్‌తోపాటు కుంతియాపై వేటు తప్పదనే...

తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపిన సర్వే సస్పెన్షన్ వివాదం టీపీసీసీ చీఫ్ తలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. గాంధీభవన్‌‌లో గొడవ, సర్వే సస్పెన్షన్‌‌పై హైకమాండ్‌ ఫైరైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌తోపాటు కుంతియాపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.

Update: 2019-01-10 01:36 GMT
Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపిన సర్వే సస్పెన్షన్ వివాదం టీపీసీసీ చీఫ్ తలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. గాంధీభవన్‌‌లో గొడవ, సర్వే సస్పెన్షన్‌‌పై హైకమాండ్‌ ఫైరైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌తోపాటు కుంతియాపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.

అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి తోడు తాజాగా పార్టీలో వివాదాలు టీపీసీసీ తలకు చుట్టుకుంటున్నాయి. పార్టీ ఓటమికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, టీకాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ కుంతియా బాధ్యత తీసుకొని తమ పదవులకు రాజీనామా చేయాలనే డిమాండ్‌ పెరిగింది. చాలామంది బహిరంగంగా డిమాండ్ చేయగా, పలువురు హైకమాండ్‌కి కంప్లైంట్‌ చేశారు. అయితే నిరసనలను తప్పించుకోవడానికి ఆలస్యంగా ఓటమి సమీక్షలు నిర్వహించారనే మాట వినిపిస్తోంది. ఇక పార్లమెంట్‌ నియోజకవర్గాల రివ్యూలు కూడా ఉత్తమ్‌, కుంతియా తలకు చుట్టుకున్నాయనే చర్చ జరుగుతోంది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం రివ్యూ సందర్భంగా జరిగిన గొడవ, సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేయడంపై అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ స్థాయి నేతను పీసీసీ ఎలా సస్పెండ్ చేస్తుందని హైకమాండ్‌ ఫైరైనట్లు చెబుతున్నారు. దాంతో ఉత్తమ్‌, కుంతియాపై త్వరలో వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.

అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో సమాధానం చెప్పుకోలేక సతమతమవుతోన్న పీసీసీ చీఫ్‌‌కు సర్వే ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారిందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు వేటు పడకపోయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌‌లో భారీ ప్రక్షాళన ఖాయమంటున్నారు.  

Similar News