శబరిమలలో మళ్ళీ శరణు ఘోష...మహిళల ప్రవేశంపై వివాదం నేపధ్యంలో హై అలెర్ట్

శబరిమలలో అయ్యప్ప ఆలయం మళ్ళీ తెరుచుకుంది. శబరిమల గుడి మకరజ్యోతి కోసం తెరుచుకోవడంతో భక్తులు దర్శనానికి పోటెత్తారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.

Update: 2018-12-31 04:12 GMT
Makkaravilakku festival

శబరిమలలో అయ్యప్ప ఆలయం మళ్ళీ తెరుచుకుంది. శబరిమల గుడి మకరజ్యోతి కోసం తెరుచుకోవడంతో భక్తులు దర్శనానికి పోటెత్తారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.

మకరజ్యోతిని పురస్కరించుకుని శబరిమల ఆలయ ద్వారాలను నిన్న సాయంత్రం తెరిచారు. ఆలయ ప్రధాన తంత్రి వీఎన్‌. వాసుదేవన్‌ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి, అయ్యప్పకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఇరుముడులు ధరించిన భక్తులను పవిత్ర పదునెట్టాంబడి మీదుగా ఆలయం లోపలికి అనుమతించారు. మకరవిళక్కు సందర్భంగా నిన్న సాయంత్రం 5గంటలకు ఆలయ ద్వారాల తెరవగానే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు.

మకరజ్యోతి సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని 21 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. అయితే 41 రోజుల మండల పూజను పురస్కరించుకుని డిసెంబరు 27 వరకూ ఆలయాన్ని తెరిచి ఉంచిన సమయంలో 10 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన కొందరు మహిళలు లోనికి ప్రవేశించేందుకు యత్నించగా భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ నేపథ్యంలో

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసు పహారా నడుమ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

జనవరి 14న మకరజ్యోతి దర్శనమిస్తుంది. తర్వాత జనవరి 20 ఉదయం 7గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ప్రస్తుతం అయ్యప్సను దర్శించుకుని ఇరుముడి సమర్పించేందుకు పంబా తీరం నుంచి శబరిమల ఆలయం వరకూ వేలమంది భక్తులు క్యూకట్టారు.శబరిమల కొండ మొత్తం శరణమయ్యప్ప అనే శరణుఘోష ప్రతి ధ్వనిస్తోంది. 

Similar News