ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్. ఆ మాటకొస్తే ఎవరి సెంటిమెంట్ వారిది. కొందరు అభ్యర్థులు గెలిస్తే ఆ పార్టీ తప్పక గెలుస్తుందని, కొందరు అభ్యర్థులు ఓడిపోతే ఆ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని ఇలా రకరకాల సెంటిమెంట్లు వినిపిస్తుంటాయి. అయితే వైసీపీ నేత రోజాపై ఉన్న సెంటిమెంట్ ఇందుకు భిన్నం. అదేంటో ఇప్పుడు చూద్దాం.
సినీ నటి ఆర్కే రోజా కాదు కాదు వైసీపీనేత ఆర్కే రోజా. ఏపీ రాజకీయాలలో సినీనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా రాజకీయ రంగ ప్రవేశం అనంతరం తనదైన స్టైల్లో పొలిటికల్ ఎట్రాక్షన్‌గా నిలిస్తూ వస్తున్నారు. అయితే రోజాపై కొన్నేళ్లుగా ఓ సెంటిమెంట్ వెంటాడుతూ వచ్చింది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా ఆ పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా బరిలో నిలబడ్డారు. అయితే రెండు సార్లు ఆమె ఓటమి చవి చూశారు. దీంతో రోజా ఓడిపోతే ఆ పార్టీ గెలుస్తుందన్న సెంటిమెంట్ అప్పటి నుండి కొన్నేళ్లపాటు రిపీట్ అవుతూ వచ్చింది.
రోజా టీడీపీలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ మీద, ఇతర పార్టీల నేతల మీద తన మాటల ప్రతాం చూపించారు. అనంతరం టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రోజా ఎమ్మెల్యేగా గెలిచినా వైసీపీ ఓడిపోయారు. దీంతో రోజా ఓడిపోతే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కానీ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ రోజా గెలిచారు. వైసీపీ ఘనవిజయం సాధించింది.