చంద్రబాబు వ్యాఖ్యలపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ల సీరియస్ .. చంద్రబాబుపై ఫిర్యాదు

Update: 2019-04-16 09:31 GMT

ఈవీఎంలపై రచ్చజరుగుతునే కొనసాగుతునే ఉంది. మరోవైపు ఐఏఎస్‌ల సంఘం నేటి మధ్యాహ్నం గవర్నర్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంలపై చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల సంఘం గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. జగన్‌ కేసులో నిందితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా ఎలా నియమిస్తారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను రిటైర్డ్‌ ఐఏఎస్‌ బృందం కోరింది. ఈ మేరకు విశ్రాంత ఐఏఎస్‌లు ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లం, గోపాల్‌ రావు, భట్టాచార్య తదితరులు గవర్నర్‌ను కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి, చీఫ్‌ సెక్రటరీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అసలు ఎన్నికల అధికారిని బెదిరించడం చాలా దారుణమన్నారు. తాము ఆత్మప్రభోదం ప్రకారమే పని చేస్తామని, తమ చర్యల వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని స్పష్టం చేశారు. రాజకీయ లబ్థి కోసమే చంద్రబాబు నాయుడు అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  

Similar News