విశాఖ బీచ్‌ రోడ్‌లో రేవ్ పార్టీ...ప్రముఖ హోటల్లో రహస్యంగా...

Update: 2019-04-17 07:16 GMT

ఇప్పటి వరకు ముంబాయి, హైదరాబాద్‌ వంటి నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు విశాఖకు పాకుతున్నాయి. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో వీకెండ్ సమయాల్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. గత వారం నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో యువతీయువకులు మద్యం మత్తులో జోగారు. విద్యార్ధులే లక్ష్యంగా ఈ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నా... పోలీసులు చూసి చూడనట్టు వ్యవహిరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యువతను నిర్వీర్యం చేసేలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Similar News