రాష్ట్రంలో ఆఖరు ఫలితం వెలువడేది అక్కడే...

Update: 2019-05-21 09:24 GMT

రాష్ట్రంలోనే ఆఖరు ఫలితం వెలువడేది రంపచోడవరం అసెంబ్లీదే విశాఖ జిల్లా అరకు పార్లమెంటు పరిధిలో రంపచోడవరం వున్నప్పటికీ ఏపీలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా రంపచోడవరం గుర్తింపు పొందింది. అసలెందుకు ఫలితం అక్కడ ఆలస్యమవుతుందో చూద్దాం..

కాకినాడలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఐదు చోట్ల ఏర్పాటు చేశారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్ లోని నన్నయ్య పిజీ సెంటర్లో రంపచోడవరం అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంపచోడవరం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లల్లో 29 రౌండ్లలో లెక్కిస్తారు.

పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు రెండేసి లెక్కింపు హాళ్లను ఏర్పాటు చేశారు. అందులో పార్లమెంటుకు ఒకటి, అసెంబ్లీకి ఒకటి చొప్పున కేటాయించారు. ఆయా నియోజకవర్గం పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను బట్టి 10 నుంచి 14 టేబుళ్లు వంతున పెట్టారు. 16నుంచి 29రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.

రంపచోడవరం నియోజకవర్గం లో 397 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన 2లక్షల 02వేల 588 ఓట్లను లెక్కిం చేందుకుగానూ 14 టేబుళ్ళు సమకూర్చారు. అయితే పోలింగ్ కేంద్రాలను బట్టి 29 రౌండ్లు లెక్కించాల్సి వుంటుంది. దీంతో జిల్లాలో 18 నియోజకవర్గాల ఫలితాలన్నీ వెల్లడయ్యాకే చివరిలో రంపచోడవరం ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.

రంపచోడరం అసెంబ్లీ ఫలితాలను వెల్లడించడం ఒక ఎత్తయితే, ఈ నియోజకవర్గం అరకు పార్లమెంటు పరిధిలో ఉండటంతో ఈ సెగ్మెంట్లో వచ్చిన ఓట్లను అరకు పార్లమెంటు రిటర్నింగ్‌ అధికారికి నివేదించాల్సి ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ ఫలితం ఓకే అయినా, పార్లమెంటు ఫలితం మాత్రం రంపచోడవరం అసెంబ్లీలో పార్లమెంటు అభ్యర్ధులకు వచ్చిన ఓట్లును కలిపిన తర్వాతనే అరకు పార్లమెంటు ఫలితం వెల్లడి చేస్తారు. అందువల్ల అరకు ఎంపీ ఫలితం కూడా ఆలస్యం కానుంది. 

Similar News