రాఫెల్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్

Update: 2019-02-08 06:41 GMT

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు రాఫెల్ కుంభకోణం ప్రధాన అస్త్రంగా మారింది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మరోసారి రాఫెల్ బాంబు పేల్చారు. రాఫెల్ డీల్‌లో ప్రధాని మోడీ ప్రమేయం పక్కా అంటున్న రాహుల్ గాంధీ దీనికి సంబంధించిన సాక్ష్యం విడుదల చేశారు. 2015లో అప్పటి రక్షణ శాఖ మాజీ డిప్యూటీ కార్యదర్శి SK శర్మ పంపిన నోట్‌ను రాహుల్ బయటపెట్టారు. పాన్స్ కంపెనీతో రక్షణ శాఖతో పాటు సమాంతరంగా మోడీ కూడా చర్చలు జరిపినట్లు‌ ఈ నోట్‌లో ఉంది.

ప్రధాని మోడీ దొంగ అని రాహుల్ విమర్శించారు. 30 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తి చోర్ కాక మరేమవుతారని ప్రశ్నించారు. అనీల్ అంబానీ కంపెనీకి లబ్ది చేకూర్చడానికి ప్రజల సొమ్ముతో మోడీ భారీ స్కాంకు పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు.  

Similar News