పూరికి షాక్ : ఇన్ స్టాగ్రామ్ లో 'ఇస్మార్ట్ శంకర్' స్క్రిప్ట్ లీక్..!

Update: 2019-06-08 06:44 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్.. రామ్ కి జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు . సినిమాని వచ్చే నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు దర్శకనిర్మాతలు .. అయితే సినిమాకి అసలు చిక్కు వచ్చి పడింది . సినిమా స్క్రిప్ట్ ని మురళీకృష్ణ అనే వ్యక్తి బజ్ బాస్కెట్ అనే ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఈ స్క్రిప్ట్ ను ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించాలంటే భారీగా నగదు ఇవ్వాలని మురళీకృష్ణ దర్శకుడు పూరిని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ అయిన పూరీ కనెక్ట్స్ ప్రతినిధి రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రవి ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News