కిసాన్‌ సమ్మాన్‌ నిధి ప్రారంభం..రైతుల ఖాతాల్లో నగదు జమ

Update: 2019-02-24 08:03 GMT

కేంద్ర ప్రభుత్వం ‍ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కిసాన్‌ సమ్మాన్‌ నిధి' పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఆయన ఈ పథకాన్ని ఆరంభించారు. తొలి విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక సహా 14 రాష్ర్టాల రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు నగదు జమ చేశారు. మిగిలిన రూ.4వేలను కేంద్రం ఇంకో రెండు విడతల్లో జమ చేయనుంది. కాగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులు రూ.6 వేల సాయం పొందాలంటే ఆధార్‌ నంబరు తప్పనిసరి. 

Similar News