అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ. 3000 పెన్షన్‌

Update: 2019-02-01 06:45 GMT

60 ఏళ్లు పూర్తయిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు 3 వేల రూపాయల పెన్షన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకుగాను త్వరలోనే 'ప్రధాన్‌ మంత్రి శ్రమ్‌ యోగి మంధన్‌' పెన్షన్‌ పథకాన్ని తీసుకురాన్నట్లు తెలిపారు. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున కార్మికులు ప్రీమియం చెల్లించాలి. దీని ద్వారా అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమలులోకి రానుంది. 

Similar News