రైతులకు ఏటా రూ 6000 నగదు సాయం

Update: 2019-02-01 06:23 GMT

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు కేంద్రం వరాలు కురిపిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 12 కోట్ల మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని పీయూష్ గోయల్ తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము చేరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ పథకం 2018 డిసెంబరు నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ.6,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ప్రకటించారు.

Similar News