కడప జిల్లాలో పీపుల్స్ సర్వే కలకలం

కడప జిల్లాలో పీపుల్స్ సర్వే కలకలం రేపింది. గ్రామాల్లో యువకులు బృందాలుగా తిరుగుతూ ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆధార్, ఓటరు కార్డు సంఖ్యలను నమోదు చేసుకుంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ సర్వే చేపట్టారు.

Update: 2019-01-27 05:45 GMT

కడప జిల్లాలో పీపుల్స్ సర్వే కలకలం రేపింది. గ్రామాల్లో యువకులు బృందాలుగా తిరుగుతూ ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆధార్, ఓటరు కార్డు సంఖ్యలను నమోదు చేసుకుంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ సర్వే చేపట్టారు. సేకరించిన వివరాలు ట్యాబ్ లో ఫీడ్ చేస్తుండటంతో అనుమానం వచ్చిన పలువురు తిరగబడ్డారు. ఎవరు చెబితే సర్వే నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు.

సర్వేల పేరుతో బోగస్ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ఓటర్ల నుంచి దశలవారీగా వివరాలు సేకరిస్తున్నారు. కడప జిల్లాలో ప్రజల నుంచి ఆదార్, ఓటర్ కార్డు నెంబర్లు ట్యాబ్ ల్లో నమోదు చేయడంతో పాటు వేలి ముద్రలు తీసుకుంటున్నారు. సర్వేకు వచ్చిన యువకులు వ్యక్తిగత వివరాలు తీసుకోవడంతో స్థానికుల్లో అనుమానాలు కల్గించాయి. ఎవరు చెబితే సర్వే చేపడుతున్నారంటూ నిలదీశారు. దీంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పలువురు వైసీపీ, జనసేన పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

అధికార పార్టీకి అనుబంధంగానే పీపుల్స్ సర్వేపేరు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ , జనసేన నాయకులు మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా లేని వారి వోట్లను తొలగించే కుట్రలో భాగమే పీపుల్స్ సర్వే అని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా సర్వే పేరుతో ఓట్లు గల్లంతుకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు వచ్చిన ఫిర్యాదులతో కడలో ఈ వ్యవహారం మరింత కలకలం రేపింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ట్యాబ్ ల్లో అప్ లోడ్ చేయడం వెనుక ఎవరున్నారో బయట పెట్టాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Similar News