పాక్ అబద్ధాన్ని బట్టబయలు చేసిన భారత్

Update: 2019-02-28 08:27 GMT

పాక్ అబద్ధాలను భారత్ మరోసారి బట్టబయలు చేసింది. నిన్న భారత్ పై F16 యుద్ధ విమానంతో పాక్ దాడికి ప్రయత్నించిన నేపధ్యం మన జవాన్లు ధీటుగా ప్రతిఘటించారు. దీంతో పాక్ కు చెందిన F16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. అయితే, పాకిస్థాన్ మాత్రం, తమ విమానాలు ఏవీ భారత భూభాగంలోకి రాలేదని చెప్పిన అబద్ధాన్నే మళ్లీ, మళ్లీ చెబుతూ వచ్చింది. అయితే, తాజాగ భారత్ పాక్ F16 విమాన శకలాల ఫోటోలను విడుదల చేసింది.

కుక్కతోక వంకరా అన్నట్టు పాకిస్థాన్ వక్రబుద్ధి ఎప్పటికీ మారదని మరోసారి నిరూపితమైంది. ఈనెల 26న భారత్‌ చేసిన మెరుపు దాడికి బదులివ్వాలనుకున్న పాక్‌ ఏదో ఒకటి చేసేయాలనే ఆత్రుత ప్రదర్శించింది. భారత్‌ కేవలం ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోగా పాక్‌ మాత్రం, మన సైనిక శిబిరాలపై దాడులకు ప్రయత్నించింది. పాక్‌కు చెందిన యుద్ధవిమానాలు హద్దులు దాటి మన గగనతలంలో ప్రవేశించాయి. వాటిని మన వైమానిక దళానికి చెందిన ఆరు మిగ్‌-21 బైసన్లు వెంటాడాయి. ఈ క్రమంలో పాక్‌ విమానాల్లో ఒకదాన్ని మన వైమానిక దళం కూల్చేసింది. ఇప్పుడ పాకిస్థాన్ కు చెందిన ఆ విమాన శకలాల ఆధారాలను భారత్ విడుదల చేసింది. పాక్ పిరికిపంద చర్యను భారత్ ఆధారాలతో సహా బయట పెట్టడంతో మరోసారి పాకిస్థాన్ వక్రబుద్ధి బయటపడింది. 

Similar News