మన అభ్యర్ధుల్లో చదువుకున్న వారెంతమంది?

Update: 2019-05-18 10:26 GMT

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ప్రజా ప్రతినిధులెలా ఉన్నారు? వీరిలో చదువుకున్న దెందరు?నిరక్షరా స్యులెందరు? ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి చూపిస్తూ ఎంపీ కావాలనుకుంటున్న మన నేతల సగటు వయసెంత? ఆసక్తి కలిగించే ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఘన చరిత్ర కలిగిన భారతదేశం ఇప్పడు ఘనమైన ప్రజాస్వామ్య ప్రక్రియను ఎదుర్కొంటోంది. అదే సార్వత్రిక ఎన్నికలు ఏ దేశంలోనైనా చదువుకున్న ప్రజాప్రతినిధులుంటే అభివృద్ధి వేగం పెరుగుతుంది. కారణం చదువుకున్న శాసనకర్తలుంటే అందరికీ మేలైన , ఉపయోగకరమైన చట్టాలను చేయడానికి ఆస్కారముంటుంది. చదువుకున్న వారయితే సమస్యలను బాగా విశ్లేషించగలరు. దేశాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలను వేగంగా తీసుకోగలరు మరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్ధులెందరు? జాతీయ ఎలక్షన్ వాచ్, ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లో 48 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లని తేలింది.

సంస్థ అధ్యయనం చేసిన 8,049 మంది లోక్ సభ అభ్యర్ధుల పత్రాల్లో 7,928 మంది నామినేషన్లు స్వీయ ప్రమాణ పత్రాలతో దాఖలయ్యాయి. 121 మంది అభ్యర్ధుల నామినేషన్లు మాత్రం పూర్తి అఫిడవిట్లు లేకపోవడంతో అధ్యయనానికి వీలు కాలేదు. సొంతంగా అన్ని వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేసిన ఏడు వేలమంది దరఖాస్తులు పరిశీలించగా వాటిలో మూడు వేల మంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారున్నారు. ఇక 44 శాతం మంది తమ విద్యార్హతలను అయిదవ తరగతి నుంచి, ఇంటర్ వరకూ చదివినట్లు గా చూపారు. వెబ్ సైట్ వివరాల ప్రకారం 253 మంది అక్షరాస్యులు, 163 మంది నిరక్షరాస్యులు.

ఇక వయసుల వివరాలకొస్తే పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో 62 శాతం మంది వయసు పాతికేళ్ళ నుంచి 50 ఏళ్ల మధ్యనుండగా,37 శాతం మంది వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్యన ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణసల సంస్థ అధ్యయనం తేల్చింది. 21వ శతాబ్దంలోకి దూసుకుపోతున్నామని చెప్పుకునే భారత్ లో చట్ట సభల్లో గ్రాడ్యుయేట్లు కేవలం 48 శాతం ఉండటం నిజంగా నిరాశాజనకమే విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశిస్తే లూటీలు, దౌర్జన్యాలు, హింస, నేరాలు, మోసాలతో కూడిన రాజకీయాలను అరికట్టవచ్చన్నది మేధావులు, విద్యావంతుల అభిప్రాయం.

Similar News