బైక్ పై విన్యాసాలు చేసిన వృద్ధుడు... అదుపు తప్పి కారును ఢీ

Update: 2019-07-12 15:17 GMT

ఇప్పుడు మేము చూపించే విజువల్స్ చూసి షాక్ అవుతారు. ఆ స్టంట్ చూసి నోరు వెళ్లబెడతారు.. కంగారు పడి గ్లాసుడు నీళ్లు ఆశ్చర్యం అవసరంలేదు.. ఎందుకంటే స్టంట్ అలాటిది మరి.. ధూమ్ సినిమాను తలపించే చేజింగ్.. గాలికన్నా వేగం.. పెద్ద వయస్సులో అద్భుతం.. అయితే ఓ విషయం ఇది కేవలం నిపుణులు మాత్రమే చేయాలి.. సో మీరు దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ట్రై చేయకండి.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి.. ‎ఈ విజువల్స్ చూసి ముసలోడే కానీ మహాను బావుడు అన్నుకున్నారా.. నిజానికి స్టంట్ సక్సస్ అయితే ఇలానే అందరూ అంటారు కానీ అక్కడ అలా జరగలేదు.. దీనికి పార్టు 2 కూడా ఉంది అదీ చూడండి.. అసలు విషయం అర్ధం అవుతుంది..

ఈ పెద్దాయన పేరు రెహ్మాన్...కృష్ణాజిల్లా జూపూడికి చెందిన ఇతను ఓ చిరు వ్యాపారి.. ఇతగాడు 60లో కూడా 20లా ఫీల్ అయ్యి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. ఇబ్రహీంపట్నం నుండి జూపూడి వైపు జాతీయరహదారిపై టీవీయస్ మీద వెళుతున్న ఇతను.. మోపెడ్ పై నిలబడి పాటలు పాడుతూ విన్యాసాలు చేస్తూ డ్రైవ్ చేశాడు.. అయితే మోపిడ్ పట్టు తప్పడంతో వెనుక వస్తున్న కారు డీ కొట్టాడు.. దీంతో ధూమ్ కాస్త భూమ్ అయ్యింది.. వృద్దుడు రెహ్మాన్ తలకి గాయాలయ్యాయి.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు..

Full View 

Tags:    

Similar News