నీరవ్‌ మోదీ అరెస్ట్‌

Update: 2019-03-20 11:53 GMT

వేలకోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌మోడీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్‌మినిస్టర్స్ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన రెండ్రోజుల తర్వాత నీరవ్‌మోడీని అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో నీరవ్‌మోడీని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్స్ కోర్టులో హాజరుపర్చనున్నారు.పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బిలియన్ డాలర్ల స్కాంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వెస్ట్ మినిష్టర్ కోర్టు ఆదేశాలతో నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు. ఏడాది క్రితమే నీరవ్ మోడీని అప్పగించాలని బ్రిటన్‌ను భారత్ కోరింది.ఈ విషయమై వెస్ట్ మినిస్టర్ కోర్టు విచారణ చేసింది. రెండు రోజుల క్రితం నీరవ్ మోడీని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరికాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో నీరవ్ మోడీని హాజరుపర్చనున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 11 వేల 400 కోట్ల స్కాంలో మోడీ ప్రధాన నిందితుడుగా ఉన్నట్టుగా భారత్ యూకేకు తెలిపింది.ఈ స్కాం బయటపడడానికి కొన్ని రోజుల ముందే నీరవ్ మోడీ యూకేకు పారిపోయాడు. జూన్ 2018న అంతర్జాతీయంగా అన్ని దేశాలకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది భారత్. ఈ నోటీసులపై స్పందించిన బ్రిటన్ ముమ్మర చర్యలు చేపట్టి అరెస్టు చేసింది. వజ్రాల వ్యాపారం పేరుతో నీరవ్ మోడీ, అతని మామ మెహల్ చౌస్కీ ఇద్దరూ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 13.5 వేల కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియా నుంచి పారిపోయారు. ఏడాదిగా ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు. కొన్ని రోజుల క్రితం లండన్‌లోని వీధుల్లో తిరుగుతుండగా.. టెలిగ్రాఫ్ మీడియా కంట పడ్డారు నీరవ్ మోడీ. లండన్ లో వజ్రాల షాపు నిర్వహిస్తున్నట్లు లోకానికి తెలిసింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత లండన్ పై ఒత్తిడి పెంచింది భారత్. ఈ మేరకు నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు. నీరవ్ మోడీ 2018, ఫిబ్రవరిలో ఇండియా నుంచి పారిపోయాడు.

Similar News