వైఎస్ హయంలో పని చేసిన అధికారులకు కీలక పోస్టులు ?

Update: 2019-05-27 16:27 GMT

రెండు రోజుల్లో ఏపీలో కొలువుదీరనున్న జగన్ ప్రభుత్వంలో కీలక శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వైఎస్ హయంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులకు జగన్ సర్కార్ లోనూ ప్రాధాన్యత దక్కనుంది. ఇప్పటికే పలువురు అధికారుల పేర్లు ఖరారుకాగ మరికొందరు జగన్ ను కలుస్తున్నారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే రాష్ట్రంలోని కీలక శాఖల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే డీజీపీగా గౌతం సవాంగ్, ఇంటిలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర పేర్లు దాదాపు ఖరారు కాగ ప్రాధాన్యత ఉన్న మిగిలిన పోస్టుల కోసం కూడా కసరత్తు జరుగుతోంది.

వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు జగన్ ప్రభుత్వంలో ప్రాధాన్య ఇవ్వనున్నారు. కీలక పోస్టులను వీరికి అప్పగించే దిశగా కసరత్తు జరుగుతోంది. వైఎస్ కు సన్నిహితులుగా ఉన్న పలువురు అధికారులతో జగన్ ఇప్పటికే భేటీ అయ్యారు. మరికొందరు నేతలు జగన్ ను కలుస్తున్నారు. వైఎస్ హయంలో ఏపీఐఐసీ ఎండీగా వ్యవహరించిన ఎల్వీ సుబ్రమణ్యానికి జగన్ ప్రభుత్వంలో సీఎస్ గా అవకాశం దక్కంది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయనకు కీలక స్థానం కల్పించాలని భావిస్తున్నారు. వైఎస్ హయంలో ఆరోగ్యశ్రీ సీఈవోగా పని చేసిన ధనుంజయరెడ్డిని సీఎంకు అదనపు కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. వైఎస్ సర్కార్ లో విజయవాడ సీపీగా పని చేసిన పీఎస్ఆర్ ఆంజనేయులను జగన్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఆడిషనల్ డీజీగా నియమించనున్నారు.

వైఎస్ హయంలో పని చేసిన అధికారులతో పాటు గతంలో రాయలసీమ ప్రాంతంలో పనిచేసి వైఎస్ కుటుంబానికి సన్నిహిత పరిచయాలు ఉన్న అధికారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పలు శాఖల్లో కీలక పోస్టులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

Similar News