అమాత్యయోగం పట్టెదెవరికి? బెర్త్‌లు దక్కేదెవరికి?

తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలతో అశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Update: 2019-01-12 05:56 GMT
cm kcr

తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలతో అశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మొత్తం 8 మందికి బెర్తులు దొరకొచ్చని కేసీఆర్ ఇచ్చిన సంకేతాలతో ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు.

ఈ నెల 18 న తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్లరించే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. ఈ విడత ఎనిమిది మంది వరకు పదవులు దక్కవచ్చని కేసీఆర్ ఇప్పటికే సంకేతాలు ఇవ్వడంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అశావహ ఎమ్మెల్యేలు కేసీఆర్ సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. మంత్రివర్గ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ముఖ్యులతో చర్చలు జరిపారు. సామాజిక సమీకరణలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే పాత కొత్త కలయికతోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.

టీఆర్ఎస్‌కు 90 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో వారికి పదవులు పంచడం కేసీఆర్‌కు కత్తిమీద సాములా మారింది. మొత్తంగా 18 మందికి మాత్రమే మంత్రి పదవుల యోగం ఉండడంతో పార్లమెంటరీ కార్యదర్శ పదవులను కూడా తాజాగా తెరపైకి తెచ్చారు. 90 మంది ఎమ్మెల్యేల్లో ఒక వంతు మందికి ఏదో ఒక పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌, విప్‌‌, పార్లమెంటరీ కార్యదర్శుల పదవులన్నీ కలిపి 33 అయ్యేలా కేసీఆర్ జాబితా తయ‌ారు చేస్తున్నార‌ని తెలుస్తుంది. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ల పేర్తు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Similar News