నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. డాక్టర్లు లేక సూపర్ వైజరే..

Update: 2019-05-11 04:06 GMT

సర్కార్ దవాఖానాలో ప్రసవం చేయించుకుంటే తెలంగాణ సర్కార్ ప్రవేశపెడుతున్న కేసీఆర్ కిట్‌తో పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికే క్యూకడుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం వైద్యం చేయడానికి వైద్యులు లేక ఏకంగా సూపర్ వైజర్లే వైద్యం చేస్తున్న వైనం ఒకటి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. రేణుక అనే మహిళ మూడో కాన్పు కోసం కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. సాధారణ ప్రసవం చేస్తామని హెల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. తీరా ప్రసవం అయ్యాక పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూసింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా మరెవరికీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి ప్రభుత్వాసుపత్రి ఘటనపై ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టనున్నారు.

Similar News