మోడీ కేబినెట్‌ తుది భేటీ : వరాలపై ఉత్కంఠ

Update: 2019-03-07 03:41 GMT

ప్రదానమంత్రి మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నివాసంలో జరగనున్న ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతులు, చక్కెర మిల్లర్లకు లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటారు. చక్కెర మిల్లర్లకు 15 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో పాటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల రోస్టర్‌ విధానం పునరుద్దరించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి కేబినేట్‌ సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనే ఉత్కంఠ నెలకొంది. కాగా ఈనెల 9 లేదా 11న ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే లోగా మరికొన్ని వరాలతో ఆకట్టుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది.

Similar News