గవర్నర్‌కి బీజేపీ లేఖ.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోతుందా?

Update: 2019-05-20 10:38 GMT

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత గోపాల్‌ భార్గవ ఆ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. వెంటనే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ లేఖలో కోరారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని అందుకే త్వరితగతిన సమావేశాలు ఏర్పాటు చేస్తే పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

230 స్థానాలున్న అసెంబ్లీలో 113 స్థానాలు కాంగ్రెస్‌కు రాగా బీజేపీకి 109 స్థానాలు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ బీఎస్పీ, ఎస్పీ, ఇతర పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి అనుకూలంగా రావడం కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే ఊహాగానాలతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ అలర్ట్‌ అయినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు జరుగుతుందనే ఊహాగానాలతో అధికార కాంగ్రెస్‌ కూడా అలర్ట్‌ అయ్యింది. ఎమ్మెల్యేలు చేజారీ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.  

Similar News