కేసీఆర్‌కు స్టాలిన్ షాక్..?

Update: 2019-05-07 11:24 GMT

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మరోసారి ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అవుతున్న సీఎం కేసీఆర్ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ నెల 13న ఆయన డీఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌తో భేటీ కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ ఉండకపోవచ్చునని డీఎంకె వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ భేటీ కాకపోవచ్చని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నందున కేసీఆర్‌తో సమావేశం కుదరకపోవచ్చని తెలిపాయి. పూర్తి వివరాలు వెల్లడించేందుకు డీఎంకే వర్గాలు నిరాకరించాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరడం​ ఇష్టం లేకే కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ విముఖత చూపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

Similar News