ఐదు రోజులుగా నీళ్లు తాగుతూ.. బాత్‌రూమ్‌లోనే చిన్నారి..

Update: 2019-04-25 10:19 GMT

మక్తల్‌లో తప్పిపోయిన అఖిల(7) ఆచూకీ లభించింది. చిన్నారి కనిపించడం లేదని ఐదురోజుల క్రితం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి మేడపై ఆడుకుంటూ చిన్నారి ప్రమాదవశాత్తు స్నానాలగదిలో పడిపోయింది. ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో చిన్నారి ఐదు రోజులుగా నీళ్లు తాగుతూ... బాత్‌రూమ్‌లోనే ఉండి పోయింది. ఇంటికి వచ్చిన యజమాని బాత్‌రూమ్‌లో ఉన్న చిన్నారి అఖిలను చూసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు... ఆ ఇంటి యజమాని తమ కుమార్తెను అప్పగించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.




 


 

Similar News