కోహ్లి ఖాతాలో మరో రికార్డు ....

Update: 2019-06-22 15:10 GMT

పరుగుల వీరుడు కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది .. ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లి ఈ ఘనత సాధించాడు .. ఇంతకి అది ఏంటంటే .. ప్రపంచ కప్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ గా ఆజారుద్దీన్ తో సమానమైన రికార్డును సొంతం చేసుకున్నాడు .. మొదటగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లి 82 పరుగులు, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు , ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో 63 బంతుల్లో 67పరుగులు చేసాడు .. కోహ్లి కనుక నెక్స్ట్ మ్యాచ్ లో మరో హాఫ్ సెంచరీ సాధిస్తే ఇప్పుడు సమం అయిన రికార్డును బ్రేక్ చేయొచ్చు ..  

Tags:    

Similar News