కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదు తెలుగు ఫ్రంట్ మాత్రమే : కోదండ రామ్

Update: 2019-05-11 06:28 GMT


సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దగ్గరికి వస్తునాయి. అందుకే తెలంగాణా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై దూకుడు పెంచారు . ఇప్పటికే దక్షణాది ప్రాంతీయ పార్టీల నేతలను కలిసిన కేసీఆర్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే .అయితే కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్మాయంగా దేశంలో నిలబడే సత్తా ఉందా.? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది ..

దీనిపై సీనియర్ నేత దత్తాత్రేయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు . కేసీఆర్ ఒక అవకాశవాది మాత్రమే నని ఆయనను నమ్మి ఎవరూ రారని, ఫ్రంట్ నిలబడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దేశంలో మూడో ఫ్రంట్ చాలా సార్లు ఫెయిల్ అయ్యిందని, కేసీఆర్ పార్టీ నేతలను కలిసినంత మాత్రనా కేసీఆర్ అందరూ వస్తారనుకుంటే అది భ్రమే అవుతుందని అని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ కూటమి మరొకటి కాంగ్రెస్ కూటమి అని.. ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక జాతీయ పార్టీలో చేరడమే తప్పితే మిగతా ఆప్షన్ లేదని అయన చెప్పుకొచ్చారు ..

దీనిపైన మరో నేత జేఏసీ చైర్మన్ కోదండరాం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు . కేసీఆర్ ప్రాతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఒక అత్యాశ అని స్పష్టం చేశారు. దేశంలో పార్టీలు కలిసి కాంగ్రెస్ తో కలిసి మహాకూమిగా ఏర్పడ్డాయని కోదండరాం చెప్పుకొచ్చారు.అయన రాజకీయ పర్యటనలు అన్ని ఒక నాటకం అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రభావం ఉండదని.. ఒకవేళ ఏర్పడినా టీఆర్ఎస్ వైసీపీ తప్పితే వేరే పార్టీ ఉండదన్నారు. దీనిని అయన ఫెడరల్ ఫ్రంట్ అనడం కన్నా తెలుగు ఫ్రంట్ అనడం మేలు అని అభిప్రాయపడ్డారు ..   

Similar News