తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

Update: 2019-05-21 06:43 GMT

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీసీ 46 శాటిలైట్‌ను ప్రయోగించనున్నడంతో స్వామి దర్శించుకున్నారు. రాకెట్ విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ మోసుకెళ్లనుంది. రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టి సారించే రీశాట్‌-2బీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని షార్‌ కేంద్రంలో ప్రథమ ప్రయోగ వేదిక నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ఉపగ్రహంతో పీఎస్‌ఎల్వీ-సీ46 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది.

Similar News