భారీగా పెరగనున్న 'కాళేశ్వరం' ప్రాజెక్ట్ వ్యయం

Update: 2019-04-21 04:21 GMT

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగబోతోంది. ముందస్తు అంచనా కంటే దాదాపు 20వేల కోట్లు పెరగనుంది. కొత్తగా మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయడంతో కాళేశ్శరం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు దాటునుంది. తెలంగాణలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తొలుత ఈ ప్రాజెక్టుకు 80వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేలా ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. ఇలా ఎత్తిపోయనున్న నీటిలో 147 టీఎంసీలను నిల్వ చేసేందుకు చిన్న, పెద్దవి కలిపి 20 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మిగిలిన 13 టీఎంసీలతో చెరువులను నింపాలని నిర్ణయించారు.

అయితే ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మధ్య మరో రిజర్వాయర్‌ను నిర్మించి అదనంగా మరో టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎల్లంపల్లి తర్వాత దానంగుట్ట దగ్గర మరో 10 టీఎంసీలతో పత్తిపాక రిజర్వాయర్‌‌‌కు డిజైన్ చేశారు. అయితే ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి మరో 20వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 80వేల కోట్లు దాటగా, కొత్తగా పత్తిపాక రిజర్వాయర్‌ ప్రతిపాదనతో మరో 20వేల కోట్లు పెరిగి మొత్తంగా లక్ష కోట్లు దాటుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Full View

Similar News