వైఎస్‌ జగన్‌తో ఐఏఎస్‌ అధికారుల భేటీ.. సెక్రటేరియట్‌లో వారి నేమ్ ప్లేట్స్‌..

Update: 2019-05-24 14:00 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన వైసీపీ అధినేత జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన వైసీపీ అధినేత జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన వైసీపీ అధినేత జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి, మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ఉన్నతాధికారులు వరుసగా సమావేశమవుతున్నారు. ఇక పరిపాలనలో అత్యంత కీలకమైన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు జగన్‌ను కలిసి చర్చిస్తుండగా, ఇవాళ 23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది ఉన్నతాధికారులు జగన్మోహన్‌రెడ్డితో సమావేశమై ఆయా శాఖల వివరాలను వివరించారు.

తనను కలిసిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్‌ తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచనలు చేశారు. పరిపాలనలో తాను తీసుకురాదల్చుకున్న మార్పులు, అనుసరించే విధానాలను అధికారులకు జగన్మోహన్‌రెడ్డి తెలియజేశారు. మరోవైపు టీటీడీ పురోహితులు జగన్ నివాసానికి వచ్చి ఆయన్ను ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ కూడా జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో అందుకు తగ్గట్లుగా సాధారణ పరిపాలనశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెక్రటేరియట్‌లో చంద్రబాబు ఫొటోలతోపాటు, మంత్రుల పేషీల్లో పేషీల్లోని మాజీ మంత్రుల ఫోటోలను, మాజీ సీఎం చంద్రబాబు ఫోటోలను తొలగించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో మాజీ మంత్రుల నేమ్ ప్లేట్స్‌ను ఇతర వస్తువుల్నీ తొలగిస్తున్నారు సచివాలయ సిబ్బంది.

Similar News