ఒకే వాహనంపై భారీగా చలానాలు...హైదరాబాద్‌లో ఇదే టాప్

అరవై ఒక్క పెండింగ్‌ చలానాలు ఉన్న ద్విచక్రవాహనాన్ని పట్టుకొని వారం గడవక ముందే 80 పెండింగ్‌ చలానాలు ఉన్న మరో వాహనదారుడిని హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2019-01-05 06:56 GMT
Traffic Challan

అరవై ఒక్క పెండింగ్‌ చలానాలు ఉన్న ద్విచక్రవాహనాన్ని పట్టుకొని వారం గడవక ముందే 80 పెండింగ్‌ చలానాలు ఉన్న మరో వాహనదారుడిని హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ప్యాట్నీ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు టీఎస్‌ 10 ఈఎల్‌ 4152 నెంబర్‌గల వాహనంపై వెళుతున్న విశాల్‌ను ఆపి తనిఖీ చేయగా 80 పెండింగ్‌ చలానాలు ఉన్నట్లు తేలింది. వాహనదారుడు చలానాల మొత్తం 12,630 చెల్లించినట్టు పోలీసులు తెలిపారు. ఒకే వాహనంపై 80 పెండింగ్‌ చలానాలు ఉండడం నగరంలో ఇదే మొదటిదని తెలిపారు.

Similar News