తెలంగాణలో సర్పంచ్‌ పదవికి విపరీతమైన పోటీ

తెలంగాణలో సర్పంచ్‌ పదవికి విపరీతమైన పోటీ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రిలీజవడంతో... పెద్దఎత్తున ఏకగ్రీవాలు అవుతున్నాయి. మరికొన్ని చోట్ల వేలం పాట పెట్టిమరీ సర్పంచ్ పదవిని కొనేసుకుంటున్నారు.

Update: 2019-01-05 05:47 GMT
Sarpanch Posts

తెలంగాణలో సర్పంచ్‌ పదవికి విపరీతమైన పోటీ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రిలీజవడంతో... పెద్దఎత్తున ఏకగ్రీవాలు అవుతున్నాయి. మరికొన్ని చోట్ల వేలం పాట పెట్టిమరీ సర్పంచ్ పదవిని కొనేసుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల నయానో భయానో బెదిరించి పంచాయతీలను కైవసం చేసుకుంటున్నారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం భోజనాయక్‌ తండాలో ఇలాంటి సీనే కనిపించింది. ఈ గ్రామంలో నిర్వహించిన వేలం పాటలో 12లక్షల 50వేల రూపాయలకు సర్పంచ్ పదవి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే సర్పంచ్ పదవికి నిర్వహించిన వేలం పాటపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది.

Full View

Similar News