జగన్ వర్సెస్ చంద్రబాబు.. గత 2014 మెజారిటీ బ్రేక్ చేస్తారా?

Update: 2019-05-09 06:11 GMT

ఏపీ ఎన్నికల సమరం ముగిసి దాదాపు నెలరోజులు అవుతుంది. ఇంక కొన్ని రోజులైతే ఏపీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఏపీ ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్లు ఫుల్ బీజీలో ఉన్నారు. బెట్టింగ్ రాయుళ్లు నియోజకవర్గాలుగా, నాయకులను బట్టి బెట్టింగ్ కాస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో మెజారిటీల మీద జోరుగా పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఎక్కవ మోజారిటీ వస్తుందా లేక జగన్‌కి మెజారిటీ ఎక్కువ వస్తుందా అనే పందాలతో పాటు గత2014లో వచ్చిన మెజారిటీని ఇద్దరూ అధినేతలు బ్రేక్ చేస్తారా? లేదా అని జోరుగా పందాలు కాస్తున్నారు.

గత 2014లో పులివెందుల నుంచి పోటీలో దిగిన జగన్‌కి 75,243 ఓట్ల మెజారిటీ లభించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 1,24,576 ఓట్లు వచ్చాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నికల బరిలో దిగిన టీడీపీ నేత సతీష్ రెడ్డికి కేవలం 49,333 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి కూడా మళ్లీ వీరిద్దరే ఎన్నికల రణరంలో దిగారు. అయితే మే 23న వచ్చే ఫలితాల్లో జగన్ మోహన్ రెడ్డి కనీసం 80వేల ఓట్ల తేడాతో గెలుస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయానికి వోస్తే గత ఫలితాలు చూస్తే 2004ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 49,588 మెజారిటీ, 2009లో 46,066 ఓట్లు, 2014లో 47,121ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు చంద్రబాబు. మరి ఈసారి మెజారిటీ ఎంత వస్తుందన్నది ఆసక్తికరమైన అంశంగా మిగిలింది. ఇద్దరు అధినేతల మెజారిటీ తేలాలంటే... ఫలితాలు వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.

Similar News