ప్రభాస్ అభ్యర్థనను ఎందుకు వెనక్కి పంపారు?: హైకోర్టు

హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ శాఖ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసింది.

Update: 2019-01-02 09:39 GMT
Prabhas

హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ శాఖ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ప్రభాస్ రెగ్యులరైజేషన్‌ అభ్యర్ధనను తిరస్కరించారంటూ హై కోర్టు దృష్టికి ప్రభాస్‌ తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన కోర్టు ఎందుకు తిరస్కరించారో చెప్పాలంటూ కోరారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇవ్వాలంటూ ఆదేశించారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు రేపు కోర్టు ముందు ఉంచుతామంటూ ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.  

Similar News