ముగిసిన తుది దశ పంచాయతీ పోలింగ్‌

Update: 2019-01-30 07:43 GMT

తెలంగాణలో పంచాయతీ పోరు ముగిసింది. చివరిదైన మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడ కొద్దిపాటి గొడవలు జరిగాయి. పెద్ద సంఖ్యలో గ్రామీణులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ తుది విడత ఎన్నికల్లో 29 జిల్లాల్లోని 3,529 పంచాయతీల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 32,055 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. 27,583 వార్డుల్లో 67,316 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రెండో విడతలో పోలింగ్ వాయిదాపడిన గ్రామాల్లో ఈ వాళ పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఓటింగ్ పూర్తి అయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. 

Similar News