గోపీచంద్ 'చాణిక్య' ఫస్ట్ లుక్ వచ్చేసింది ...

Update: 2019-06-13 01:02 GMT

గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'చాణిక్య'.. పీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. మేహరీన్ కధానాయకగా నటిస్తుంది . తిరు దర్శకుడు . ప్రస్తుతం సినిమా షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది . అయితే హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం .. గుబురు గడ్డంతో గోపీచంద్‌ ఈ లుక్ లో కనిపిస్తున్నాడు. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన అంశాలు పుష్కలంగా ఉన్నాయని సినిమా యూనిట్ చెబుతుంది . ఈ సినిమాకి విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.




 


Tags:    

Similar News