అందుకే వైసీపీకి రాజీనామా చేశా : ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

Update: 2019-01-24 06:34 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. వైసీపీ విధివిధానాలు నచ్చక పోవడం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆదిశేషగిరిరావు అన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి చర్చించిన తరువాత పార్టీలో చేరే తేదిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. టీడీపీ - వైసీపీల మధ్యే ఎన్నికలు జరుగుతాయన్న ఆయన చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. 

Full View

Similar News