టీడీపీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి

Update: 2019-03-30 07:49 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార పార్టీ తెలుగుదేశంనికి షాక్ లా మీద షాక్స్ తగులుతునే ఉన్నాయి.ఇప్పటికే టీడీపీకి గుడ్ బై కొంతమంది వైసీపీ, జనసేన పార్టీలలో చేరిన విషయం తెలిసిందే కాగా తాజాగా కడప జిల్లాలో టీడీపీ భారీ షాక్ తగిలింది. పార్టీకి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సాయి ప్రతాప్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. కాగా తెలుగుదేశం పార్టీలో తనకు స్థానం కల్పించి తగిన గౌరవించినందుకు సాయి ప్రతాప్ నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. టీడీపీలో సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడప సమస్యల పరిష్కారానికే టీడీపీలో చేరనని కానీ టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారన్నారు. నారా చంద్రబాబు నాయుడు తీరువల్ల మనోవేదనకు గురయ్యారనన్నారు. కాగారెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. సాయి ప్రతాప్ కాంగ్రెస్ హయాంలో రాజంపేట నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. కాగా 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. ఇక మరోవైపు ఎన్నికలకు ముందే సాయిప్రతాప్ టీడీపీని వీడటతో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీకి కొంత మేర నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Similar News