దసరా క్రిస్మన్ సెలవులు పెరిగాయి ..

Update: 2019-06-11 16:07 GMT

సెలవులు అనేది చిన్న పిల్లలకు పెద్ద వాళ్ళకి సంతోషకరమైన విషయం.. ఎందుకంటే చిన్నపిల్లలకి అయితే ఎంచక్కా ఆడుకోవచ్చు .. పెద్దవాళ్ళకి అయితే టూర్స్ కి ప్లాన్ చేసుకోవచ్చు.. అయితే వీరికోసం తెలంగాణా సర్కార్ శుభవార్తను అందజేసింది .. దసరా, క్రిస్మస్ సెలవులను పెంచింది. విద్యా సంవత్సరం క్యాలండరును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది స్కూళ్లు 232 రోజులు పనిచేయాలి.

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 నాటికి మొత్తం 16 రోజులు దసరా సెలవులు ఇచ్చారు. ఇదివరకు దసరాకు 13 రోజుల సెలవులే ఉండేవి. తాజా క్యాలెండరులో క్రైస్తవ మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 28 వరకూ 7 రోజులు క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. ఇక సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి. 1 నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 29 నాటికి సిలబస్ బోధన పూర్తి కావాలి.

10వ తరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికే పూర్తి చేయాలి. అక్టోబర్ 21 నుంచి 26 వరకు ఎస్ఏ 1 పరీక్షలు, ఏప్రిల్ 7 నుంచి 16 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 29 నాటికి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులుగా ప్రకటించారు.

Similar News