అమరవీరుల త్యాగాలను రాజకీయం చేయవద్దు: రాహుల్

Update: 2019-02-27 13:11 GMT

పాకిస్థాన్ మీద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌ను 21 విపక్ష పార్టీలు అభినందించాయి. కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ, సీపీఎం సహా 21 విపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. అయితే సైన్యం సాహసాలను అధికార పార్టీ కేవలం తమ రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని విపక్షాలు అభిప్రాయపడ్డారు. అమరవీరుల త్యాగాలను రాజకీయం చేయవద్దన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఎన్డీయేతర పక్షాల సమావేశంలో పుల్వామ ఘటనలో చనిపోయన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. అఖిలపక్ష సమావేశానికి పిలువకపోవడంపై మోడీపై మండిపడ్డారు. భారత జవాన్ల వెంట తామున్నామని రాహుల్ చెప్పారు. రాజకీయాల కంటే జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తప్పిపోయిన పైలెట్ గురించి తాము ఆందోళన చెందుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు.

Similar News