శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన ఫొని ఎఫెక్ట్...

Update: 2019-05-02 07:00 GMT

శ్రీకాకుళం జిల్లాలో ఫొని ఎఫెక్ట్ ప్రారంభమైంది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు తోడు ఈదురు గాలులు కూడా వీస్తు ఉండటంతో స్ధానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ముందస్తు హెచ్చరికల నేపధ్యంలో చెట్ల కింద ఉండవద్దంటూ అధికారులు ప్రచారం చేయడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతాలకు చేరుకున్న NDRF బలగాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా విరిగిపడ్డాయి. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు గంటకు120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు.    

Similar News