డోర్ తీసేముందు జాగ్రత్త : అమెరికాలో కాలింగ్ బెల్ కొట్టిన మొసలి

Update: 2019-05-10 11:11 GMT

ఇంట్లో కాలింగ్‌ బెల్‌ మోగగానే హడావిడిగా వెళ్లి తలుపు తీయకండి ఎందుకంటారా ! ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం . దక్షిణ కరోలీనాలో ఆరున్నర అడుగుల పొడవున్న మొసలి కాలింగ్‌ బెల్‌ కొట్టింది! చదువుతుంటే నమ్మశక్యంగా లేకపోయినా నిజంగానే జరిగింది . మిర్టిల్‌ బీచ్‌కు సమీపంలో కరెన్‌ ఆల్ఫానో అనే మహిళ ఇంటివద్ద ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆమె పొరుగింటి వాళ్లు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో న్యూస్ కాస్తా వైరల్‌గా మారింది. కాగా స్థానికులు జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారమివ్వడంతో. అధికారులు వెంటనే అలెర్ట్ అయి మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

Similar News