పంచాయతీ ఎన్నికల్లో ముందే చేతులెత్తేసిన కాంగ్రెస్ పెద్దలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పంచాయితీ ఎన్నికల గురించి పట్టనట్టుగా వ్యవహరిస్తోందా...? సర్పంచ్ అభ్యర్దులుగా బరిలోకి దింపడానికి వెనకడుగు వేస్తోందా..అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

Update: 2019-01-12 02:09 GMT
congress

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పంచాయితీ ఎన్నికల గురించి పట్టనట్టుగా వ్యవహరిస్తోందా...? సర్పంచ్ అభ్యర్దులుగా బరిలోకి దింపడానికి వెనకడుగు వేస్తోందా..అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పంచాయతీ పోరు పట్ల కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడానికి ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటి విడత పంచాయతీ నామినేషన్లలో టీఆర్ఎస్ ఏకగ్రీవాలపై దృష్టిపెడితే రెండో విడత నామినేషన్ల పర్వం సాగుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టనట్లే వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోరులో అధికార పార్టీ దూసుకుపోతుంటే ప్రతిపక్షం మాత్రం ఆ షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్లుగా లేదు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలను పట్టించుకోకపోవడానికి కారణం గతంలో ఎదురైన చేదు అనుభవాలేనని తెలుస్తోంది. గత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల్లో చాలా మంది అధికార పార్టీ గూటికి చేరడంతో మళ్ళీ అదే పునరావృతమౌతుందని టీపీసీసీ నేతలు భయపడుతున్నారు. సర్పంచ్ అభ్యర్ధులను కష్టపడి గెలుపించుకున్నా ఆ తర్వాత వారు గులాబీ కండువా కప్పుకుంటారనే భానవలో ఉన్నారు. అందుకే పార్టీ పేరు చెప్పుకుని కష్టపడి గెలిచిన వారికి మాత్రమే అండదండగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే పార్టీ ముఖ్యనేతలు నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడటం లేదు.

అయితే టీపీసీసీ నేతల వైఖరి కొందరు నేతలకు మిగుడు పడడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పాడిన కార్యకర్తలను కాపాడుకోవడానికి టీపీసీ ఎలాంటి కార్యచరణకు పిలుపు ఇవ్వకపోవడంపై విమర్శిస్తున్నారు. టీపీసీసీ పెద్దల తీరుతో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు సైతం గత్యంతరం లేక టీఆర్ఎస్ పంచన చేరుతున్నారని అంటున్నారు.  

Similar News