కేసీఆర్, జగన్ దోస్తీపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

Update: 2019-04-28 05:20 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గూలాబీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మధ్య మంచీ దోస్తానం పై గత కొద్దిరోజులుగా అంతటా చర్చించుకుంటున్పారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత, ఏపీ ఆపద్దర్మ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానూ ఇటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫూల్ సపోర్టు ఇస్తుందనేది అందరికి తెలిసిన ముచ్చనే. ఇక ఏపీ ఎన్నికలకు ముందు కేటీఆర్ లోటస్‌ పాండ్‌కు వెళ్లి వైఎస్ జగన్‌ను కలవడం ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించడం అన్నీ జరిగాయి. అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన తరువాత కూడా ఏపీలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డియే అధికార పగ్గాలు చేపడతారంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే తాజాగా జగన్, కేసీఆర్ దోస్తీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ వేదికపై ఫెడరల్ ఫ్రంట్ పై విజయశాంతి వ్యాఖ్యలు చేశారు.

వైసీసీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేలా అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించాడంటూ గత రెండ్లపాటు ఏపీ అసెంబ్లీని బహిష్కరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఏమైనా న్యాయమా? అంటూ జగన్ మోహన్ రెడ్డిని విజయశాంతి ప్రశ్నించారు. ఏపీలో తప్పయిన ఫిరాయింపులు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఒప్పవుతాయో జగన్ చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై వైఎస్ జగన్ అభిప్రాయం ఏంటో వివరించాలని విజయశాంతి తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అయితే మొన్నటి వరకు కేవలం సీఎం కేసీఆరే టార్గెట్‌గా చేసిన విజయశాంతి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం ఏంటని ఇప్పడు రాజకీయాల్లో హట్ టాపీక్‌గా మారింది. 




 




 


Similar News