మోడీ అనుకూల కూటమిలో టీఆర్ఎస్, వైసీపీ: చంద్రబాబు

ఎన్నికలకు ఇంకా 100 రోజులే ఉన్నాయని ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

Update: 2019-01-18 06:04 GMT
CM Chandrababu

ఎన్నికలకు ఇంకా 100 రోజులే ఉన్నాయని ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక భూమిక పోషించాలని అన్నారు. రేపు కోల్‌కతాలో జరగనున్న బీజేపీ యేతర పార్టీల ర్యాలీకి హాజరవుతున్నట్లు వివరించారు. టీఆర్ఎస్‌, వైసీపీ మినహా అన్ని పార్టీలు కోల్‌కతా వస్తున్నాయని దీన్ని బట్టే ఆ రెండు పార్టీలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసిపోతుందని అన్నారు. దేశంలో మోడీ అనుకూల, వ్యతిరేక కూటమిలు రెండే ఉన్నాయని టీఆర్ఎస్‌, వైసీపీ పార్టీ మోడీ అనుకూల కూటమిలో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. దుష్ప్రచరాలు చేసేందుకే కడపలో ఇవాళ బీజేపీ జాతీయ నేతల సభ జరుగుతుందని అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Similar News