బీజేపీ చేసిన మోసాన్ని రాష్ట్రపతికి వివరించాం : చంద్రబాబు

Update: 2019-02-12 08:25 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమైంది. ఏపీ భవన్ నుంచి టీడీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు పాదయాత్రగా బయలుదేరారు. దారి పోడవునా మోడీకి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని నినాదాలిచ్చారు.

18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చంద్రబాబు నాయుడు బృందం రాష్ట్రపతికి అందజేసింది. ఏపీకీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయలేదని రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు.

విభజన హామీలు అమలు చేస్తామని బీజెపీ నమ్మించి మోసం చేసిందన్నారు చంద్రబాబు . ఏపీ ప్రజలు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని అన్నారు. ఏపీకి నిధులివ్వకుండా బీజేపీ కాలక్షేపం చేసిందన్న చంద్రబాబు మోడీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. 

Similar News