టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ సంపూర్ణం

Update: 2019-06-06 14:43 GMT

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం సంపూర్ణమైంది. సీఎల్పీ విలీనం పూర్తైనట్టు అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఉదయం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి లేఖను అందజేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సీఎల్పీని, టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ లో తెలిపింది. దీంతో కాంగ్రెస్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. 

Tags:    

Similar News