వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే ఆమంచి

Update: 2019-02-13 06:03 GMT

చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ తెలుగు దేశం పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. పార్టీలో కొనసాగేలా జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు ముఖ్యమంత్రి చంద్రబాబు బుజ్జగించినా ఆమంచి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రభుత్వ సంబంధం లేని కొన్ని శక్తుల ప్రేమయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. పార్టీ వైఖరిపై గత కొద్ది కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమంచి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి నచ్చజెప్పడంతో మెత్తబడినట్టు వార్తలు వినిపించాయి. ముఖ్యమంత్రితో భేటి అయ్యి వారం కూడా గడవక ముందే పార్టీకి రాజీనామా చేశారు.

వైసీపీ అధినేత జగన్ జిల్లాలో నిర్వహించే సమర శంఖారావం సందర్భంగా ఆమంచి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. లోటస్‌పౌండ్‌లో వైఎస్‌ జగన్‌తో భేటి అయిన ఆమంచి వివిధ అంశాలపై చర్చించారు. ఆమంచి రాజీనామాతో నియోజకవర్గ బాధ్యతను ఎమ్మెల్సీ కరణం బలరాంకు సీఎం చంద్రబాబు అప్పగించారు. తక్షణమే కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని సూచించారు.   

Similar News